
ఆర్టీసీకి రాఖీ ధమాకా
ఆసిఫాబాద్: రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోకు భారీ ఆదాయం సమకూరుతోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి హైదరా బాద్‌కు మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. డిపోకు మామూలు రోజుల్లో రోజు కు రూ.16 లక్షల నుంచి రూ. 18లక్షల ఆదా యం వస్తోంది. రక్షాబంధన్ నేపథ్యంలో ఈ నెల 8న 47 వేల మంది ప్రయాణికులను గ మ్యానికి చేర్చగా రూ.21,78,000 ఆదాయం సమకూరింది. ఈ నెల 9న 48 వేల మంది ప్రయాణించగా రూ.21,61,000 ఆదాయం వచ్చిందని డీఎం రాజశేఖర్ తెలిపారు. ఆదివారం సైతం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల రద్దీ కొనసాగింది.