
‘కూపన్ల బాధ్యత ఇవ్వకుంటే రాజీనామా’
కాగజ్‌నగర్ టౌన్: ఎరువులు, యూరియా పంపిణీ చేసేందుకు జారీ చేసే కూపన్ల బాధ్యత తమకు ఇ వ్వకుంటే రాజీనామా చేస్తామని ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘం చైర్మన్ ఉమామహేశ్వర్‌రావు పేర్కొన్నారు. శనివారం పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ కూపన్లను వ్య వసాయాధికారులు పంచడమేమిటని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, యూరియా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాధికారులు రైతులకు పంటలపై సూచనలు, సలహాలు చేస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కానీ, రైతువేదికల్లో ఉండి రైతులకు కూపన్లు పంపిణీ చేయడం సరికాదని పేర్కొన్నారు. వ్యవసాయాధికా రులు ఇష్టం వచ్చిన వారికి కూపన్లు అందజేస్తున్నారని ఆరోపించారు. దీంతో అసలైన రైతులకు ఎరువులు అందక నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రావు, నగునూరి తిరుపతి, దరిణి రాములు, కెకరి నానాజీ, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.