
అటవీ భూముల్లో అక్రమసాగు
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ అటవీ డివిజన్ రేంజ్ పరిధిలోని కర్జెల్లి బీట్‌లో రెండువేల ఎకరాల అటవీ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించామని కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సు శాంత్ సుఖ్‌దేవ్ బొబడే తెలిపారు. శనివారం కాగజ్‌నగర్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరుల కు వెల్లడించారు. కర్జెల్లి బీట్ పరిధిలో 350 కు టుంబాలు అటవీభూమిని అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. కర్జెల్లి రేంజ్‌లోని ఎనిమిది కుటుంబాలవారు 150 ఎకరా లు, మరో ఎనిమిది కుటుంబాల వారు 74, 44 కుటుంబాల వారు 244, 16 కుటుంబాల వా రు 472, 14 కుటుంబాలవారు 632, మరో ఇ ద్దరి వద్ద 34 ఎకరాల అటవీభూమి అక్రమంగా సాగులో ఉందని తెలిపారు. అక్రమంగా సాగు చేసుకుంటున్న వారితో సమావేశాలు నిర్వహించి విచారణ చేపట్టి ఒక్కొక్కరికి మూడెకరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. కర్జెల్లి ఎఫ్‌ఆర్వో సుభాష్ ఉన్నారు.