
ఆదివాసీల అభివృద్ధికి కృషి
కెరమెరి: కాంగ్రెస్ ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ పేర్కొన్నారు. శనివారం మండలంలో ని జోడేఘాట్‌లో నిర్వహించిన ఆదివాసీ దినో త్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల హక్కులు, సంప్రదాయాల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆదివాసీల భూ ములు, అటవీ హక్కులు, జీవన విధానం కా పాడడం మనందరి బాధ్యత అని పేర్కొన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి గిరిజనుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు కుమురంభీం సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. కు మురంభీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం, నాయకులు పెందోర్ రాజేశ్వర్, కోవ ఇందిర, యశోద, సుజా యత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.