
ఆదివాసీల అభివృద్ధికి నిరంతర కృషి
ఆసిఫాబాద్: ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం ని రంతర కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ దీపక్ తివా రి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భ వన్‌లో జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ని ర్వహించిన వేడుకలకు ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి రమాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని సూచించారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేసిన కుమురంభీం స్ఫూర్తిగా ఆది వాసీలు ముందుకు సాగాలని తెలిపారు. అధికారు ల సమన్వయంతో సంపూర్ణతా అభియాన్‌కింద ఎంపికై న తిర్యాణి మండలం రెండుసార్లు జాతీయ అవార్డు కై వసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. జీవో 49 రద్దు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద ని, ఆదివాసీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యాభివృద్ధిలో భాగంగా అదనపు తరగతి గదులు నిర్మించి గిరిజన పిల్లలకు గుణాత్మక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాకు నూతన వసతి గృహాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వైద్యాభి వృద్ధికోసం నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏ ర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఆ దివాసీలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలి పారు. ఆదివాసీల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు శివాజీ చౌక్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి అంబేడ్కర్ చౌక్‌లోని అంబేడ్కర్, కు మురంభీం చౌక్‌లోని కుమురంభీం విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. డప్పుచప్పు ళ్లు, గుస్సాడీ నృత్యాలతో ఆదివాసీ భవన్‌కు చేరుకున్నారు. ఆదివాసీ జెండాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు ఆదివాసీ గీ తాలపై చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, ఎఫ్‌డీవో దేవిదాస్, గోండ్వానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అర్జు, జీసీడీవో శకుంతల, గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరా వు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏసీఎం ఉద్దవ్, జిల్లాలోని తొమ్మిది ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీల్లో చైతన్యం తేవాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ఆదివాసీల్లో చైతన్యం నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు సూచించా రు. శనివారం మండలంలోని జోడేఘాట్‌లో కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి, భీం సమాధిపై పూలు చల్లి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహ న కలిగి ఉండాలని సూచించారు. ఆదివాసీ చ ట్టాల అమలు కోసం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రావు, సెడ్మకి ఆనంద్‌రావు, పెందోర్ రాజేశ్వర్ తదితరులున్నారు.

ఆదివాసీల అభివృద్ధికి నిరంతర కృషి

ఆదివాసీల అభివృద్ధికి నిరంతర కృషి