
● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా
ఇబ్బంది పడాల్సి వస్తోంది
నాలుగు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదు. ఆస్పత్రిలో డ్యూటీ చేసినా ఫలితం లేకుండా పోతోంది. సంబంధిత ఏజెన్సీ వారిని అడిగితే డబ్బులు రాలేదని చెబుతున్నారు.
– నరేశ్, సెక్యూరిటీ, కాగజ్‌నగర్ సీహెచ్‌సీ
అధికారులే దయ చూపాలే
రెక్కాడితే గాని డొ క్కాడని కుటుంబం మాది. నాకు ముగ్గు రు ఆడపిల్లలున్నా రు. చాలీచాలని జీతా లతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నం. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడాల్సి వస్తోంది. అధికారు లే దయ చూపి సమస్య పరిష్కరించాలి.
– భాగ్య, స్వీపర్, కాగజ్‌నగర్
చర్యలు తీసుకోవాలి
ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలందిస్తున్నాం. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న మాపై అధికారులు దయ చూపాలి. వెంటనే స్పందించి మా వేతనంలో కోత పెట్టిన ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటా సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలి.
– తిరుమల, పేషెంట్ కేర్, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ టౌన్: జిల్లాలోని తెలంగాణ వైద్య విధా న పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు మూడేళ్లుగా కాంట్రాక్టర్ ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటా జమ చేయడంలేదు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెజ్జూరు, సిర్పూరు(టి), వాంకిడి, తిర్యాణి, జైనూర్ ఆస్పత్రుల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సె క్యూరిటీ విభాగాలు, స్వీపర్లు, అటెండర్లుగా 100 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరు 2022లో భీం సొసైటీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కింద విధుల్లో చేరారు. అప్పటినుంచి విధులు నిర్వహిస్తున్నా సంబంఽధిత కాంట్రాక్టర్ శ్రీకాంత్ వీరి వేతనాల్లో కో త పెట్టిన డబ్బులు ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటా చెల్లించడంలేదు. ఆస్పత్రి అధికారులతో కుమ్మకై ్క ఉద్యోగులు వాటా సొమ్ము కాజేశారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు, ఇటీవల వచ్చిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందించి కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు వేతనాలు అందిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత సూ పరింటెండెంట్ చెన్నకేశవ్‌ను మందలించారు. కాంట్రాక్టర్ మూడేళ్లుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించకుండా ఉంటే అతడిపై చర్యలు తీసుకోవడంలేదని నిలదీ శారు. అయితే వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ గడు వు ఈ నెలతో ముగియనుండగా ‘కోత’ల వివాదం సమసి పోతుందనే భావనలో ఉన్నట్లు కార్మికులు వాపోతున్నారు.
కుమ్మకై ్క నష్టం జేస్తున్నరు
కాంట్రాక్టర్, సూపరింటెండెంట్ కుమ్మక్కయ్యారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి మూడేళ్లుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లిస్తలేదు. ఉన్నతాధికారులకు తెలిపినా స్పందించలేదు. వైద్యవిధాన పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
– బోగె ఉపేందర్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
అధికారులకు తెలిపినా అంతే..
భీం సొసైటీ ద్వారా విధులు నిర్వహిస్తున్న. ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటా ఎగ్గొడుతున్న కాంట్రాక్టర్‌పై అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు మా సమస్య పరిష్కరించాలి
– ఇమ్రాన్, సెక్యూరిటీ, కాగజ్‌నగర్

● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా

● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా

● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా

● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా

● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా

● మూడేళ్లుగా జమ చేయని కాంట్రాక్టర్ ● నాలుగు నెలల వేతనా