
ఐదు వారాలైనా పైసలు రాలే..
తిర్యాణి: దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ఉపాధి కల్పించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపె ట్టింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పిస్తోంది. చేసిన పని ఆధారంగా గరిష్టంగా ఒక్కొక్కరికి రోజుకు రూ.304 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలో కూలీలకు ఎంతగానో ఉపయోగపడింది. తదనంతరం పథకంలో మార్పులు చేయడం.. ఇందులోని నిబంధనలకు లోబడి వేతనాలు సరైన సమయంలో విడుద ల చేయకపోవడంతో కూలీలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కింద 1.23లక్షల జాబ్‌కార్డులుండగా అందులో 2.43 లక్ష ల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 91వేల జాబ్ కార్డులు యాక్టీవ్‌లో ఉండగా 1.70 లక్షల మంది కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు.
నిలిచిన వేతనాలు
ఉపాధిహామీ చట్టం ప్రకారం కూలీలు పని చేసిన 21 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలి. కానీ, గత మే మొదటి వారం నుంచి ఇప్పటివరకు కూలీలకు వేతనాలు అందలేదు. జూన్‌తోనే దాదాపు అన్ని చోట్ల ఉ పాధి పనులు ముగుస్తుంటాయి. తిరిగి నవంబర్ నుంచి ప్రారంభమవుతుంటాయి. అయితే పనులు పూర్తయి దాదాపు రెండు నెలలైనా నేటికీ (2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) జిల్లాలో రూ.15.08 కోట్ల కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉ న్నట్లు తెలుస్తోంది. అయితే వానాకాలం పంటల సాగు ముగిశాక రైతు కూలీలకు పని దొరకకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరి చారు. అయితే ఒక్కో కూలీకి సంబంధించి దాదాపు ఐదు వారాల వేతనాల చెల్లింపులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కూలీలు కుటుంబ పోషణకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఎక్కువగా కూలీలకు సంబంధించి పోస్టాఫీస్ ఖాతాల్లోనే వేతనాలు జమ అవుతుంటాయి. దీంతో వేతనాలు వచ్చాయో.. లేదో.. తెలియక కూలీలు నిత్యం పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
నిలిచిన ఉపాధిహామీ వేతనాలు
పెండింగ్‌లో రూ.15.08 కోట్లు
ఇబ్బందులు పడుతున్న కూలీలు