
బస్టాండ్లలో రాఖీ రద్దీ
ఆసిఫాబాద్: రాఖీ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే ప్రయాణికులతో కిటకిటలాడింది. ఇదే సమయంలో అద్దె బస్సు డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండుగంటల పాటు బస్టాండ్ వద్ద నిరసన తెలుపగా మరింత రద్దీ పెరిగింది. డీఎం రాజశేఖర్ కల్పించుకుని పండుగపూట నిరసన తెలుపడం సరికా దని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చే స్తానని హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించా రు. రాఖీ సందర్భంగా హైదరాబాద్‌కు ఒక సూపర్ లగ్జరీ బస్సు, మూడు ఎక్స్‌ప్రెస్‌లు అదనంగా నడుపుతున్నట్లు ఈ సందర్భంగా డీఎం తెలిపారు.
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ బస్టాండ్ శనివారం మహిళా ప్రయాణికులతో కిటకిటలాడింది. కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాల, కౌటాల, బెజ్జూరు, ఆసిఫాబాద్, పెంచికల్‌పేట్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. బస్సులు ఎక్కే క్రమంలో తోపులాటలు కూడా జరిగాయి. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లోనూ రద్దీ కనిపించింది.