
హక్కుల పరిరక్షణకు చర్య తీసుకోవాలి
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ప్రేమల గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆదివాసీ దినోత్సవ ప్రా ముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆది వాసీ అభివృద్ధికి తోడ్పడుతున్న అధికారులు, సంఘాల నాయకులను అభినందించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే దుస్తులు ధరించి నృత్యాలు చే స్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కుమురంభీం, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులకు ఎమ్మెల్యే రాఖీ కట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ నాయకురాలు మర్సోకోల సరస్వతి, తుడుందెబ్బ నాయకులు బుర్స పోచయ్య, కొట్నాక విజయ్‌కుమార్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.