
అర్హులందరికీ రేషన్‌కార్డులు పంపిణీ
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని, ఇది నిరంతర పక్రియ అని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు కేవలం ఆహార భద్రత కోసం కాకుండా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కిలో రేషన్ బియ్యంపై రూ.29 ఖర్చు చేస్తుందన్నారు. బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని మా దృష్టికి వచ్చిందని, అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ మండలంలో 664 మందికి కొత్త కార్డులు అందిస్తామని, 5,099 మంది కార్డుల్లో మార్పులుచేర్పులు చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, బీజేపీ మండలాధ్యక్షుడు అశోక్, నాయకులు కార్తీక్, వంశీ, సుమన్ పాల్గొన్నారు.
పోస్ట్‌మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ప్రారంభం
కాగజ్‌నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్‌ను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోస్టుమెట్రిక్ హాస్టల్ అందుబాటులోకి రావడంతో నియోజకవర్గంలో ఇంటర్, డిగ్రీ చదువుకునే విద్యార్థులు కాగజ్‌నగర్‌పట్టణంలో ఉండొచ్చన్నారు. ప్రస్తుతం వందమందికి వసతి కల్పించిందని తెలిపారు. వసతిగృహంలో 70 శాతం ఎస్సీ, 12 శాతం బీసీ, 5 శాతం ఎస్టీ, 4 శాతం ఓసీ, 9 శాతం ఇతరులకు రిజర్వేషన్ కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డీఐఈవో కల్యాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.