
ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఆసిఫాబాద్: జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్స వం ఘనంగా నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఈ నెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు తొమ్మిది తెగల నాయకులు సహకరించాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ప్రజలు, సాంస్కృతిక బృందాలను తీసుకువచ్చేందుకు వాహన ఖర్చులు ఐటీడీఏ భరించాలని కోరారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మడావి శ్రీనివాస్, నాయకులు సిడాం అర్జు, మారుతి, నర్సింగ్‌రావు, సుధాకర్, ఆత్రం భీమ్‌రావు, సంతోష్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
కూరగాయల సాగుపై దృష్టిసారించాలి
పీవీటీజీ రైతులు కూరగాయల సాగుపై దృష్టి సా రించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గిరిజన అ భివృద్ధి అధికారి రమాదేవి, ఐటీడీఏ ఉద్యాన వి భాగం అధికారులతో కలిసి పీవీటీజీ రైతులకు 10 రకాల హైబ్రిడ్ కూరగాయల విత్తనాలు ఉచితంగా అందించారు. పీవీటీజీలకు ప్రభుత్వం టమాట, మిర్చి, వంకాయ, కాకరకాయ, ఆకుకూరల వంటి విత్తనాలు అందిస్తుందని తెలిపారు.