
ఢిల్లీ తరలిన కాంగ్రెస్ నేతలు
ఆసిఫాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నేతలు తరలివెళ్లారు. ఢిల్లీ కి వెళ్లిన వారిలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బీసీ సంఘాల నాయకులు డాక్టర్ రమేశ్, బాలేశ్వర్‌గౌడ్, గోపాల్, శివ తదితరులు ఉన్నారు.
ముగిసిన శిక్షణ తరగతులు
పెంచికల్‌పేట్: మండల కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఎంపీడీవో అల్బర్ట్ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో వంద రోజులు పని పూర్తి చేసిన వారికి ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్య్రూనర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ కార్యాలయ హెచ్‌ఆర్ మేనేజర్ మల్లేశ్, ఏపీవో సతీశ్, ఏపీఎం అశోక్, డీఆర్పీ ఆనంద్, ఎస్‌బీఐ సిబ్బంది ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ తరలిన కాంగ్రెస్ నేతలు