ఎస్పీఎం ఎన్నికలు నిర్వహించాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లో కార్మిక కమిషనర్ చంద్రశేఖరన్‌కు ఎస్పీఎం మజ్దూర్ యూనియన్(సీఐటీయూ ఈ2510) నాయకులు వినతిపత్రం అందించారు. యూ నియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ మాట్లాడుతూ ఎస్పీఎంలో నిలిపివేసిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పక్రియను తిరిగి ప్రా రంభించాలన్నారు. కార్మిక సంఘం లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయన్నా రు. కనీసం క్యాంటీన్ కూడా లేదని, ఉద్యోగ భద్రత లేక కార్మికులు భయంగా విధులు ని ర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ కూశన రాజ న్న, వైస్ ప్రెసిడెంట్ ముంజం శ్రీనివాస్, సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ కృష్ణమాచారి పాల్గొన్నారు.


