సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శం
ఆసిఫాబాద్‌అర్బన్: దక్షణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట రథసారధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దినకర్ అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కా ర్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దినకర్ మాట్లాడు తూ 1932లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి తన ఇంటి నుంచే పోరాటం ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో నాయకులు కోట శ్రీనివాస్, రాజేందర్, కార్తీక్, టీకానంద్, కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు.


