రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాలు ర ఆశ్రమ పాఠశాల, డిగ్రీ బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు సీనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం కర్నూ తెలిపా రు. ఆశ్రమ పాఠశాల ఆవరణలో సోమవారం విద్యార్థులను అభినందించారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది బాలురు, డిగ్రీ గురుకుల కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు వరంగల్‌లో జరిగే ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.


