ఆసిఫాబాద్– ఉట్నూర్ రోడ్డు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్–ఉట్నూర్ రోడ్డుపై గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే మెరుగుపర్చాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భా గంగా సోమవారం ఆసిఫాబాద్ నియోజకర్గంలోని రహదారుల సమస్యను ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని కోరారు. కుమురంభీం ప్రాజెక్టుకు మరమ్మతు చేపట్టాలని, గుండి, లక్మాపూర్, అనార్‌పల్లి వంతెనలు పూర్తి చేయాలన్నారు. సీఆర్టీలకు ఎనిమిది నెలలుగా వేతనాలు రావడం లేదని పేర్కొన్నారు.


