ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ అర్జీదారుల సమస్యలు వింటూ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన జాదవ్ రోహిదాస్ తమ గ్రామంలో ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ నిర్వాసితుల జాబితాలో తన పేరు లేదని, విచారణ చేపట్టాలని విన్నవించాడు. సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పట్టా పాసుపుస్తకం అందించాలని రెబ్బెన మండలం గంగాపూర్‌కు చెందిన దుర్గం లక్ష్మి అర్జీ అందించింది. భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిందని, పరిహారం అందించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన పడాల తిరుపతి దరఖాస్తు చేసుకున్నాడు. వరిధాన్యం కొనుగోలు చేయాలని కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన రైతులు వేడుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్ మండలం కోసినికి చెందిన పల్లపు అనసూయ అర్జీ అందించింది. కొనుగోలు చేసిన భూమికి సాదాబైనామా ప్రకారం పట్టా మార్పిడి చేయాలని కెరమెరి మండలం ఝరి గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి దరఖాస్తు చేసుకున్నాడు. పట్టా భూమి కొలతలు చేయడానికి రుసుం చెల్లించామని, వెంటనే కొలతలు చేపట్టాలని కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్‌కు చెందిన సెండె ఓమాజీ విన్నవించాడు. జన్కాపూర్‌లోని ఇంటి ఎదుట రహ దారిని ఓ వ్యక్తి ఆక్రమించాడని, చర్యలు తీసుకోవా లని నారాయణ గౌడ్ కోరాడు. గతేడాది కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రోత్సాహకం అందించాలని దుర్గం శ్రీకాంత్, మౌనిక దంపతులు వినతిపత్రం అందించారు.


