డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్
● ప్రమాదాల నివారణకు వాహనాల తనిఖీ ● జిల్లా వ్యాప్తంగా 1,785 కేసులు నమోదు ● నాలుగు నెలల్లో 646 మందికి జరిమానా
నిబంధనలు పాటించాలి
మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు. రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలి. ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఎవరైనా మద్యం సేవించి వాహనాన్ని నడిపి ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తున్నాం. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారస్ చేస్తున్నాం. గత నాలుగు నెలల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1,785 మందిపై కేసులు నమోదు చేశాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టబడితే తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ను ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి.
– డీవీ శ్రీనివాస్‌రావ్, ఎస్పీ
ఆసిఫాబాద్‌అర్బన్: మద్యం సేవించి వాహనాలు న డిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై పోలీ స్‌శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా కేసులు నమోదు చేయడంతోపాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారస్ చేయనుంది. ప్రమాదా లను నివారించేందుకు జిల్లాలో ప్రతీరోజు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో అధికారులు డ్రంకెన్‌డ్రైవ్, వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1,785 మందికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్న్లిచ్చారు. 646 మందికి రూ.9,33,331 జరిమానా విధించారు. మిగతా 1,139 కేసులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డ్రంకెన్‌డ్రైవ్ కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఎస్పీ పోలీస్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
ప్రమాదాల నివారణే లక్ష్యంగా..
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. గ్రామాల్లో కళాబృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
పట్టుబడితే శిక్షలు తప్పవు
జిల్లాలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే పోలీస్‌శాఖ వారిపై కఠినంగా వ్యవహరించనుంది. దశలవారీగా శిక్షల మోతాదును కూడా పెంచనుంది. తాగి వాహనాలు నడపవద్దని, తద్వారా జరిగే ప్రమాదాల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలపై పోలీస్‌శాఖ కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. పట్టుబడిన వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు పరుస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రెండోసారి పట్టుబడితే సేవించిన మద్యం మోతాదును బట్టి తప్పనిసరిగా శిక్షలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారికి నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులు పాటించాల్సిన నియమాలను వివరిస్తున్నారు. దీనిపై నిరవధిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్


