దేవుడి భూములు కబ్జా | - | Sakshi
Sakshi News home page

దేవుడి భూములు కబ్జా

Apr 19 2025 9:30 AM | Updated on Apr 19 2025 9:30 AM

దేవుడ

దేవుడి భూములు కబ్జా

ఆసిఫాబాద్‌: ఆలయ భూములనూ అక్రమార్కులు వదలడంలేదు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయ భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. ఆసిఫాబాద్‌ మండలంలోని సర్వే నంబర్‌ 80/ఏ, 80/బీ, 81, 82, 83, 84, 94లలో 89.13 ఎకరాల దేవాదాయశాఖ భూమి ఉంది. కాగా, గోవింద్‌పూర్‌ శివారులోని సర్వే నంబర్‌ 83లోని భూమి ఆక్రమణకు గురైంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూ ములకు ఏటా వేలం నిర్వహించి కౌలుకు ఇస్తున్నా రు. ఏటా వచ్చే సుమారు రూ.20లక్షలను దేవాదా యశాఖ ఖాతాలో జమ చేస్తున్నారు. అధికారులు భూముల రక్షణపై దృష్టి సారించకపోవడంతో ఆల య భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కేశవనాథ ఆలయ భూముల్లో తొలుత తాత్కాలిక అనుమతులు, అనంతరం పక్కా భవనాలు నిర్మించి కొందరు కబ్జా చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్‌ 83లో 8.32 ఎకరాల భూమి ఉండగా, గోవింద్‌పూర్‌కు చెందిన కొందరు 1.18 ఎకరాల భూమిలో అక్రమార్కులు షెడ్లు నిర్మించుకున్నారు. కొందరైతే పక్కా భవన నిర్మాణాలు పూర్తి చేశారు. ఆక్రమణకు గురైన భూమికి సంబంధించి సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేయగా, వారు రాజకీయ నాయకులను ఆశ్రయించి వాటిని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2001లో 1.18 ఎకరాల్లో తాత్కాలిక షెడ్డు నిర్మించుకున్నాక వారితో ఏటా భూమికి అద్దె చెల్లించేలా ఒప్పందం రాసుకున్నారు. ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించడం లేదు. పైగా తాత్కాలిక ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులు అపై పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని దేవాదాయశాఖ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక కూడా అందజేశారు.

సర్వే చేయాలని ఏడాదిగా కోరుతున్నా..

కేశవనాథ ఆలయ భూముల సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా వారు సర్వే చేపట్టక పోవడంతో సదరు భూములు అన్యాక్రాంతమవుతూనే ఉన్నాయి. ఆలయ భూములకు కొలతలు చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

కేశవనాథ ఆలయ భూముల ఆక్రమణపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటాం.

– వేణుగోపాల్‌ గుప్తా, ఆలయ ఈవో

తాత్కాలికం.. ఆపై శాశ్వతం..

వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు

హద్దుల ఏర్పాటు ఎప్పుడో..?

చోద్యం చూస్తున్న అధికారులు

దేవుడి భూములు కబ్జా1
1/1

దేవుడి భూములు కబ్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement