అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం

Apr 15 2025 12:12 AM | Updated on Apr 15 2025 12:12 AM

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం

ఆసిఫాబాద్‌అర్బన్‌: అంబేడ్కర్‌ జీవితం ప్రతీ ఒక్కరి కి ఆదర్శనీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణ లో సోమవారం బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు ప్రజలు అనుభవిస్తున్న హక్కులన్నీ రాజ్యాంగ ఫలాలేనని అన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాణాప్రతాప్‌, రవీందర్‌, ఆర్‌ఐ పెద్దన్న, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షు డు విజయ శంకర్‌రెడ్డి, సీసీ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement