అంతా.. చెత్తాచెదారం
కౌటాల: మండలంలోని శీర్షా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొక్కలు ఎండిపోతున్నాయి. పచ్చదనం లేకపోవడంతో ప్రజలు అటువైపు వెళ్లడం లేదు. అలాగే మండలంలోని ముత్తంపేట పల్లె ప్రకృతి వనం బోర్డు ఊడిపోయింది. ప్రకృతి వనంలోని చెట్ల ఆకులు రాలి కుప్పలుగా ఉన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయినా తొలగించడం లేదు. వేసవిలో మందుబాబులకు అడ్డాగా మారింది. గురుడుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోయగూడ పల్లె ప్రకృతి వనంలో నిర్వహణ లేక మొక్కలు ఎండిపోయాయి. ఊరికి దూరంగా ఉండటం ఇబ్బందికరంగా మారింది.


