ఆసిఫాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుందని ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ జిల్లా క న్వీనర్ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత సంఘ భవనంలో సోమవారం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల పాలనాపరంగా అనుకూలంగా ఉంటుందని, ఓటింగ్‌శాతం కూడా పెరుగుతుందన్నారు. దర్శక నిర్మాత దండనాయకుల సురేశ్ కుమార్ మాట్లాడుతూ మేధావులు, విశ్రాంత ఉద్యోగులు దేశభవిష్యత్ దృష్ట్యా ఈ విషయాన్ని సమాజంలో ప్రతిఒక్కరికి తెలిసేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాగౌడ్, యూనిట్ అధ్యక్షుడు కే.రమేశ్, విశ్రాంత ఉద్యోగులు గుర్రాల వెంకటేశ్వర్లు, లింగయ్య, రామారావు, వెంకన్న, బాలశ్రీరాములు, సుగుణాకర్, కనకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


