● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
రెబ్బెన(ఆసిఫాబాద్): మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం మండలంలోని సింగల్‌గూడ గ్రామంలో ఇందిరమ్మ మహిళాశక్తి పథకం కింద ఏర్పాటు చేసిన చేపల పెంపకం కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివా రీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. చేపల పెంపకం ద్వారా మ రింత ఆదాయాన్ని పొందవచ్చని, సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని పేర్కొన్నా రు. ఈ కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా మండలాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న మ హిళా సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్ రామ్మోహన్‌రావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృత, ఏపీఎం వెంకటరమణ, సీసీలు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందుకు హాజరు
ఆసిఫాబాద్: రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో శనివారం రాత్రి మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఏఎస్‌బీ చిత్తరంజన్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి రమాదేవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల ప్రతినిధులు కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు అధికారులను శాలువాలతో సన్మానించారు. కలెక్టర్, అధికారులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ నాయకులు అబ్దుల్లా, అలీబిన్ అహ్మద్, అబుల్ ఫయాజ్, మీర్ సాబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.


