ఆసిఫాబాద్‌అర్బన్: ఇటీవల హర్యానాలో నిర్వహించిన 73వ ఆల్ ఇండియా పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించిన ఆసిఫాబాద్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ పొట్ట గోపిని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ చూపి పోలీసుశాఖకు పేరు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ పెద్దన్న, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.