ముగిసిన 48 గంటల ధర్నా
ఆసిఫాబాద్: గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల ధర్నా కార్యక్రమం మంగళవారం ముగిసింది. సీఐటీయూ జిల్లా నా యకులు మాట్ల రాజు మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్లకు ప్రతినెలా వేతనాలు 1వ తేదీనే చెల్లించాలని, గ్రాట్యుటీ వర్తింపజేసి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన రూ.18 వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్‌వాడీ టీచర్లు 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతి ని ధులు త్రివేణి, గంగామణి, అరుణ, స్వరూ ప, రాజేశ్వరి, కమల, అంజలి, మల్లేశ్వరి, అంగన్‌వాడీ టీచర్లు, హె ల్పర్లు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేవీ రాజశేఖర్ మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా రవాణాశాఖ అధికారి రాంచందర్‌ను కలిశారు.
కలెక్టర్‌ను కలిసిన డీఎం