● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు లేక రాకపోకలకు అవస్థలు ● ఏళ్లు గడుస్తున్నా మెరుగుపడని వైద్యం ● నిధుల కేటాయింపుపైనే ప్రజల ఆశలు ● నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు లేక రాకపోకలకు అవస్థలు ● ఏళ్లు గడుస్తున్నా మెరుగుపడని వైద్యం ● నిధుల కేటాయింపుపైనే ప్రజల ఆశలు ● నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి

Mar 19 2025 12:56 AM | Updated on Mar 19 2025 12:52 AM

పేరుకే ఆస్పత్రి అప్‌గ్రేడ్‌

జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయడంతో స్థానిక 50 పడకల ఆస్పత్రిని 330 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. అయినా వసతులు మెరుగుపడటం పడకపోవడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్‌కే వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గైనకాలజిస్టు లేకపోవడం సిజేరియన్‌ కాన్పులు జరగడం లేదు. ఈ నెల 9న ఆసిఫాబాద్‌ మండలానికి చెందిన ఓ గర్భిణిని మంచిర్యాలకు రెఫర్‌ చేయగా.. 108 వాహనంలో తరలిస్తుండగానే మార్గమధ్యలో కవలలకు జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కేవలం రెఫరల్‌ కేంద్రంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ని యామకం జరగలేదు. కాంట్రాక్టు వైద్యులతో కాలం వెల్లదీస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథ కం బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

కంకర తేలిన ఆసిఫాబాద్‌ మండలం

యాపల్‌పట్టి గ్రామానికి వెళ్లే రహదారి

ప్రజలకు అభివృద్ధి ఫలాలు కాస్త చేరువైనా.. అనుకున్న రీతిలో మౌలిక వసతులు మెరుగుపడలేదు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో యాసంగికి నీళ్లందక పంట పొలాలు బీళ్లుగా మిగులుతున్నాయి. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ వంటి కాలేజీలు లేక స్థానిక విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాల మంజూరైనా.. సిర్పూర్‌ నియోజకవర్గానికి కేటాయించలేదు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఆసిఫాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ సర్కారు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలకే ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా రహదారులు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై జిల్లా ప్రజలు, రైతులు అసంతృప్తితో ఉన్నారు.

రాకపోకలకు తంటాలు

గతేడాది జిల్లాలోని 76 చోట్ల ప్రధాన వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా మంజూరు కాలేదు. రహదారుల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో మరీ అధ్వానంగా మారి రాకపోకలకు ప్రజలు తంటాలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 400కు పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడం లేదు. 15 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే మగ్గుతోంది. రూ.2.5 కోట్లతో ప్రారంభమైన అంచనా వ్యయం ప్రస్తుతం రూ.14.40 కోట్లకు పెరిగింది. అలాగే లక్మాపూర్‌ బ్రిడ్జి అసంపూర్తిగా ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్‌ ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలమయంగా మారింది. రీ బీటీ చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు కేటాయించడం లేదు.

కుమురంభీం ప్రాజెక్టు

నిధులు కేటాయిస్తేనే.. సాగునీరు

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటా యింపు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. జగన్నాథ్‌పూర్‌, కుమురంభీం(అడ) ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ పూర్తి కావడానికి సుమారు రూ.250 కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్‌లో కాంగ్రెస్‌ సర్కారు కుమురంభీం ప్రాజెక్టుకు రూ.7.95 కోట్లు, జగన్నాథపూర్‌ ప్రాజెక్టుకు రూ.12.32 కోట్లు, వట్టివాగు ప్రాజెక్టుకు రూ. 2.59 కోట్లు, ఎన్టీఆర్‌ సాగర్‌ ప్రాజెక్టుకు రూ. 15.60 లక్షలు, పీపీరావు సాగర్‌కు రూ.2.34 కో ట్లు కేటాయించింది. ఇందులో చాలా వరకు నిధులు ఖర్చు చేయలేదని తెలుస్తోంది.

అడ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 53 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. కాల్వలు అసంపూర్తిగా ఉండటంతో కనీసం 10వేల ఎకరాలకు కూడా సాగునీరందడం లే దు. ప్రాజెక్టు కట్ట బీటలు తేలి మూడేళ్లవుతు న్నా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి ఇరిగేషన్‌ ఈఎన్‌సీ ప్రాజెక్టు సందర్శించి కాంక్రీ ట్‌ పోర్షన్‌ కట్టాలని సూచించారు. మరమ్మతులకు సుమారు రూ.30 కోట్లు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆసిఫాబాద్‌ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ఆరేళ్లక్రితం రూ.27.76 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా నిధులు కేటాయించలేదు. కుమురంభీం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.20 లక్షలు, వట్టివాగు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు మాత్రమే మంజూరు చేస్తున్నారు.

20 ఏళ్లక్రితం ప్రారంభించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసినగొంగళి అక్కడే ఉంది. ప్రాజెక్టులో ముంపునకు గురైన రైతులకు నేటికీ నష్టపరిహారం అందలేదు. నిధులు కేటాయించక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలోనే నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల్లో ఇది ఒక్కటి.

● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు 1
1/2

● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు

● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు 2
2/2

● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement