ఆసిఫాబాద్‌అర్బన్: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రా వ్ అన్నారు. ఇందుకు నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహ నం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభాపతిపై ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు అగ్రకుల అహ ంకారంతోనే మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నా యకులు బాలేశ్వర్‌గౌడ్, చరణ్, గుండాశ్యాం, అసద్, మారుతీపటేల్, రూప్‌నార్ రమేష్, గోపాల్‌నాయక్, శివప్రసాద్ పాల్గొన్నారు.