రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన డోర్లి– 2 ఓసీపీని మంగళవారం కోల్ కంట్రోల్ అధికారులు సందర్శించారు. నాగ్‌పూర్ కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్‌డీ సందీప్ ఎస్ పరాంజ పేతో పాటు కొత్తగూడెం కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్‌డీ డీవీ సుబ్రమణ్యం ఏరియా అధికారులతో కలిసి మూతపడిన గని, పరిసర ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం చేపట్టిన పర్యావరణ పనులు, ఓసీపీ వద్ద నాటిన మొక్కలు, ఎదిగిన వృక్షాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న నీటి నిర్వహణ, మృతిక సంరక్షణ చర్యల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గోలే టి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఇన్‌చార్జి జీఎం నరేందర్ కోల్ కంట్రోల్ అధికారులకు ఏరి యా స్థితిగతుల వివరాలను వెల్లడించారు. కార్యక్రమాల్లో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, ఏరియా సర్వే అధికారి ఆప్సర్ పాషా, డీవైఎఎస్‌వో శేఖర్, కార్పొరేట్ అదనపు మేనేజర్లు తిరుపతి, బాబ్జీ, డోర్లి– 2 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్‌మెంట్ అధికారి హరీశ్, ఫారెస్టు అధికారి రమణారెడ్డి, ఎస్టేట్ అధికారి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశీలిస్తున్న కోల్ కంట్రోల్ అధికారులు


