
ఎల్కపల్లి కొనుగోలు కేంద్రం తనిఖీ
పెంచికల్‌పేట్(సిర్పూర్): మండలంలోని ఎ ల్కపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీసీఎస్‌వో వెంకట నరసింహరావు తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి పది రోజులు గడుస్తు న్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలు కేంద్రం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తేమశాతం పరిశీలించి వెంటవెంటనే కాంటా వేయాలని ఆదేశించారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిబ్బంది, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.