
పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ విఠల్
పెంచికల్‌పేట్(సిర్పూర్): ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్. ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరెంటు లేక.. పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. అంతకు ముందు బీఎస్పీ, బీజేపీ నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లోకి చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నాయకులు బిట్టి శ్రీనివాస్, అలిశెట్టి రాజన్న, గంగన్న, నగేశ్, వెంకటేశ్, రాజన్న తదితరులు ఉన్నారు.