● అసెంబ్లీ ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ● ఆసిఫాబాద్‌లో 17 మంది.. సిర్పూర్‌లో 13 మంది ● ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది మంది స్వతంత్రులు ● 5 నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, ఆసిఫాబాద్: లెక్క తేలింది.. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఫలితంగా ఈ నెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులేవరనే దానిపై స్పష్టత వచ్చింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిర్పూర్ నియోజకవర్గంలో 13 మంది, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 17 మంది ఈసారి ఎన్నికల్లో పోటీ పడనున్నారు. అయితే ఒక్కో ఈవీఎంలో కేవలం 16 మంది అభ్యర్థులకు ఓటింగ్ అవకాశం ఉంటుంది. ఆసిఫాబాద్‌లో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో రెండేసి ఈవీఎంలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బుజ్జగింపుల్లేవ్..!
జిల్లాలో నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఉపసంహరణకు రెండు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో నామినేషన్లను దాఖలు చేసిన రెబల్స్, స్వతంత్ర, ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగిస్తారు. కానీ.. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. మంగళవారం సిర్పూర్ నుంచి దుర్గం శ్యాంరావు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. చివరిరోజు బుధవారం మరో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. సిర్పూర్ నియోజవర్గానికి సంబంధించి మొత్తం 17 నామినేషన్లు ఆమోదం పొందగా అందులో నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి దీపక్ తివారి వెల్లడించారు. దుర్గం శ్యాంరావు(స్వతంత్ర) జాడి శ్యాంరావు(భారత ప్రజాకీయ పార్టీ), సోదరి నిరంజన్ (సోషలిస్టు పార్టీ), లలిత్ బల్హోత్ర(యుగ తులసీ పార్టీ) వారి నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థుల్లో నార్నూర్ మండలానికి చెందిన ఆడె బాలజీ మాత్రమే నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇది ఇటు అధికారులకు, అటు ఓటర్లకు కొంత సంకటంగా మారింది. ఆసిఫాబాద్ బరిలో 17 మంది అభ్యర్థులు మిగలడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసిఫాబాద్‌లో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటం గమనార్హం.
గుర్తులు లేక తంటాలు
ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు కోరిన గుర్తులు లేకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారులు ఇక్కట్లు పడ్డారు. చివరికి రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపి గుర్తుల కేటాయింపు పూర్తి చేశారు. సాధారణంగా ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే పోటీలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు అభ్యర్థులు కోరిన గుర్తులు.. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల్లో లేకపోవడంతో సమ స్య ఏర్పడింది. అదే విషయాన్ని అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా వారు అందుబాటులో లేదు. దీంతో వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించిన అనంతరం ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులు కేటాయించారు. బుధ వారం అర్ధరాత్రి వరకు అభ్యర్థుల గుర్తుల వివ రాలను అధికా రులు బయటికి వెల్లడించడలేదు.
అభ్యర్థి పార్టీ కేటాయించిన గుర్తు
కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్ కారు
రావి శ్రీనివాస్ కాంగ్రెస్ హస్తం
పాల్వాయి హరీశ్‌బాబు బీజేపీ కమలం
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ ఏనుగు
కామెర నగేశ్ ఇండియన్ ప్రజాబంధు
కోబ్రగడే గంతీదాస్ న్యూఇండియా పార్టీ
జె.దీపక్‌కుమార్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా
ఆర్.అజయ్‌కుమార్ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ
డోంగ్రి ప్రవీణ్‌కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్
పర్చాకి కేశవ్‌రావు గోండ్వానా గణతంత్ర పార్టీ
దాసరి వెంకటేశ్ స్వతంత్ర
దేశగణి సాంబశివగౌడ్ స్వతంత్ర
ఎల్ములే మనోహర్ స్వతంత్ర