నిర్మల్‌ క్షేత్రంలో రెడ్డిలదే హవా | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ క్షేత్రంలో రెడ్డిలదే హవా

Nov 4 2023 1:42 AM | Updated on Nov 4 2023 1:42 AM

నిర్మల్‌ నియోజకవర్గం - Sakshi

నిర్మల్‌ నియోజకవర్గం

● ఇప్పటివరకు ఒకరు మినహా వారిదే హవా ● ప్రధానపార్టీల నుంచి పోటీ ● ప్రస్తుత పోటీదారుల్లో ఇద్దరు రెడ్డిలే ● నిర్మల్‌ కంచుకోట వారిదేనా ● అమాత్యులు, ఎంపీలుగా అవకాశం
నిర్మల్‌ నియోజకవర్గంలో ఓటర్లు

నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజ కీయ ఖిల్లాగా పేరొందిన నిర్మల్‌ నియోజకవర్గం ఇప్పటికీ హాట్‌టాపికే. ప్రధానంగా ఇక్కడి నుంచి గెలిచినవారే జిల్లావ్యాప్తంగా చక్రం తిప్పారు. రాజ కీయ ఉద్దండులందరూ ఇక్కడి నుంచి ఎదిగినవారే కావడం విశేషం. నిర్మల్‌ నియోజకవర్గం తొలినాళ్ల నుంచి రెడ్డిలతే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుత జిల్లాలో నిర్మల్‌, ముధోల్‌ (జనరల్‌) ఖానాపూర్‌ (ఎస్టీ) స్థానాలు ఉన్నాయి. నిర్మల్‌లో రె డ్డి వర్గం నుంచి రాజకీయ చైతన్యం అధికంగా ఉండటంతోనే ఇది సాధ్యమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. అన్ని ప్రధానపార్టీల నుంచి వారే బ రిలో నిలవడంతో ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. మొట్టమొదట ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికై న గోపిడి గంగారెడ్డి మొదలుకొని 2018లో గెలిచిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వరకు దాదాపు రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధిస్తూ వస్తున్నారు.

రెడ్డి సామాజికవర్గ రాజకీయ నేపథ్యం..

1952లో జరిగిన తొలిసారి నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న నిర్మల్‌ నుంచి జి.గంగారెడ్డి సోషలిస్టు పార్టీ నుంచి గెలుపొందగా, 1957లో కె.ముత్యంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి విజయం సాధించారు. 1962, 1967, 1972ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పి.నర్సారెడ్డి వరుసగా గెలిచారు. 1978 ఎన్నికల్లో పి.గంగారెడ్డి కాంగ్రెస్‌ నుంచి, 1983లో టీడీపీ తరఫున ఏ.భీంరెడ్డి శాసనసభలో అడుగుపెట్టారు. 1985లో టీడీపీ అభ్యర్థిగా సముద్రాల వేణుగోపాలాచారి మొదటిసారిగా రెడ్డియేతర సామాజిక వర్గం నుంచి విజయం సాధించారు. 1989, 1994లో వరుసగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, 2009లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన శాసనసభ ఎన్నికల్లో మళ్లీ ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. వరుసగా 2018లో గెలిచి మరోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, 1996 జరిగిన ఉప ఎన్నికల్లో నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడి నుంచి వరుసగా రెడ్డి వర్గానికి చెందిన అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి రెండుసార్లు, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఒకసారి గెలిచారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018లో అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు.

ప్రస్తుత పోటీల్లో ఇద్దరు వారే..

ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల నుంచి బరిలో ఉన్నవా రిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం వారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ) ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి వెలమ సామాజికవర్గాని కి చెందిన కూచాడి శ్రీహరిరావు పోటీలో ఉన్నారు.

ఇంద్రకరణ్‌రెడ్డి

పురుషులు: 1,17,563

మహిళలు: 1,26,102

మొత్తం: 2,47,495

సంవత్సరం గెలుపొందినఅభ్యర్థి పార్టీ ఓడిన సమీపఅభ్యర్థి పార్టీ

2018 ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎ.మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌

2014 ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి బీఎస్పీ కె.శ్రీహరిరావు బీఆర్‌ఎస్‌

2009 ఎ.మహేశ్వర్‌రెడ్డి పీఆర్పీ ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి టీడీపీ

2004 ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ వి.సత్యనారాయణగౌడ్‌ టీడీపీ

1999 ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎన్‌.ఇంద్రకరణ్‌రెడ్డి టీడీపీ

1996 ఎన్‌.ఇంద్రకరణ్‌రెడ్డి టీడీపీ అప్పాల మహేశ్‌ కాంగ్రెస్‌

1994 ఎస్‌.వేణుగోపాలాచారి టీడీపీ పి.నర్సారెడ్డి కాంగ్రెస్‌

1989 ఎస్‌.వేణుగోపాలాచారి టీడీపీ ఎ.భీంరెడ్డి కాంగ్రెస్‌

1985 ఎస్‌.వేణుగోపాలచారి టీడీపీ జీవీ.నర్సారెడ్డి కాంగ్రెస్‌

1983 ఎ.భీంరెడ్డి టీడీపీ పి.గంగారెడ్డి కాంగ్రెస్‌

1978 పి.గంగారెడ్డి కాంగ్రెస్‌ పి.నర్సారెడ్డి కాంగ్రెస్‌

1972 పి.నర్సారెడ్డి కాంగ్రెస్‌ ఏకగ్రీవం

1967 పి.నర్సారెడ్డి కాంగ్రెస్‌ ఎల్‌.ప్రభాకర్‌రెడ్డి స్వతంత్ర

1962 పి.నర్సారెడ్డి కాంగ్రెస్‌ పి.గంగారెడ్డి స్వతంత్ర

1957 కె.ముత్యంరెడ్డి స్వతంత్ర ఆర్‌.దేశ్‌పాండే కాంగ్రెస్‌

1952 జి.గంగారెడ్డి సోషలిస్ట్‌ పి.రెడ్డి కాంగ్రెస్‌

స్వరాష్ట్రంలో రెండుసార్లు మంత్రి పదవి

రాష్ట్ర ఏర్పడ్డాక 2014లో తొలిసారి శాసనసభ ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా బా ధ్యతలు చేపట్టారు. అప్పటి ఉమ్మడి జిల్లా ను ంచి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్‌ నుంచి అల్లోల ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా పని చేయడం గమనార్హం. 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన అల్లోల మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన నిర్మల్‌ నుంచి గెలుపొంది..రెండుసార్లు రాష్ట్రమంత్రి పదవి చేపట్టడం విశేషం.

మండలాలు..

నిర్మల్‌ అర్బన్‌, నిర్మల్‌రూరల్‌, దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌(జి), సారంగాపూర్‌,

లక్ష్మణచాంద,మామడ,సోన్‌

’రెడ్డి’లపై ’చారి’త్రాత్మక విజయం..

నిర్మల్‌ నుంచి బరిలో ఉన్న రెడ్డి వర్గానికి చెందిన వారిపై మూడుసార్లు బీసీ సామాజికవర్గానికి చెందిన సముద్రాల వేణుగోపాలాచారి గెలుపొందడం విశేషం. మొదటిసారి 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జీవీ నర్సారెడ్డిపై దాదాపు 23 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 1989లో అయిండ్ల భీమ్‌రెడ్డి, 1994లో పి.నర్సారెడ్డిపై వేణుగోపాలాచారి మూడుసార్లు గెలుపొందారు. అనంతరం రాష్ట్రమంత్రిగా, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు.

1
1/11

2
2/11

సంవత్సరం గెలుపొందినఅభ్యర్థి పార్టీ ఓడిన సమీపఅభ్యర్థి పార్టీ3
3/11

సంవత్సరం గెలుపొందినఅభ్యర్థి పార్టీ ఓడిన సమీపఅభ్యర్థి పార్టీ

4
4/11

5
5/11

పి.గంగారెడ్డి6
6/11

పి.గంగారెడ్డి

7
7/11

8
8/11

9
9/11

10
10/11

నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి 11
11/11

నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement