కుటుంబ సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: కుటుంబ సమస్యల అందే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. ఖమ్మంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ సున్నితమైన కుటుంబసమస్యలు, దంపతుల వివాదా లు, గృహహింసకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యాన చట్టపరిధిలో కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారానికి కృషిచేయాలని తెలిపారు. అలాగే, మహిళలపై వేధింపులు, గృహహింస, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. సీఐ ఉస్మాన్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్ల సర్వీస్‌ దాటిన

హోంగార్డులు వెనక్కి..

ఖమ్మంక్రైం: రవాణా శాఖ కార్యాలయాల్లో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న హోంగార్డులను వెనక్కి పంపించాలని శాఖ కమిషనర్‌ ఇలంబరిది ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సర్వీస్‌ ఆధారంగా ఎనిమిది మంది హోంగార్డుల జాబితా ఆర్‌టీఓ జగదీష్‌ సిద్ధం చేశారు. ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తుండడంతో ఏజెంట్లు, దళారులతో కుమ్మకై ్క న పలువురు హోంగార్డులు నగదు వసూళ్లలో ఉద్యోగులకు సహకరిస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీంతో వారిని తిరిగి పోలీసు శాఖకు పంపించాలన్న ఆదేశాలతో ఖమ్మంతోపాటు, సత్తుపల్లి, వైరాలో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మందిని అటాచ్‌ చేయనున్నారు. ఆ తర్వాత కొత్తగా వారిని నియమించి వారిపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈక్రమాన ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వెంటనే హోంగార్డు కార్యాలయానికి పంపించే అవకాశముంది.

ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ

కామేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి సూచించారు. కామేపల్లి మండలం గోవింద్రాల ప్రభుత్వ పాఠశాల, పాతలింగాల కేజీబీవీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించిన ఆమె, మరింత మెరుగుపడేలా బోధనలో నూతన పద్ధతులు అవలంభించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించడం, మెరుగైన విద్యా ఫలి తాల సాధనకు కృషి సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం మెనూ అమలుపై ఆరా తీయడమే కాక కూరగాయలు, సామగ్రిని తనిఖీ చేశారు. ఎంఈఓ వెంకట్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రయాణికుల రద్దీకి

అనుగుణంగా బస్సులు

● ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సరిరామ్‌

భద్రాచలంఅర్బన్‌: ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు నడిపిస్తూ ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ సరిరామ్‌ సూచించారు. భద్రాచలం ఆర్టీసీ డిపో, బస్టాండ్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల మేనేజర్లతో సమావేశమైన ఆర్‌ఎం మాట్లాడుతూ భద్రాచలంలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ప్రత్యేకంగా పరీక్షించాక అనుమతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు విజయశ్రీ, శ్రీనివాస్‌, ఎంఎఫ్‌లు చక్రవర్తి, శ్రీనివాస్‌, భద్రాచలం డిపో మేనేజర్‌ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement