కలిసిపోయాం.. పింఛన్‌ రద్దు చేయండి ! | - | Sakshi
Sakshi News home page

కలిసిపోయాం.. పింఛన్‌ రద్దు చేయండి !

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) కొత్త సీఈఓను సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసినట్లు సమాచారం. ఇన్‌చార్జ్‌ సీఈఓగా ఉన్న వెంకటఆదిత్య స్థానంలో రెగ్యులర్‌ సీఈఓ నియామకానికి ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈమేరకు గత సోమవారం జరిగిన ఇంటర్వ్యూలకు 11మంది హాజరయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కె.ఉమామహేశ్వర్‌రెడ్డి కూడా ఉండగా, ఆయనను సీఈఓగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయనకు సంబంధించి పూర్తి వివరాలతో ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ప్రవాహ్‌ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఆపై ఆర్‌బీఐ అనుమతించాక త్రీమెన్‌ కమిటీ సీఈఓ పేరును ప్రకటించనుంది.

మధిర(చింతకాని): మధిర మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దంపతులు యాస నరసింహారావు, యాస సుజాత కొంతకాలం క్రితం మనస్పర్ధలతో విడిపోయారు. దీంతో సుజాత ఒంటరి మహిళ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇటీవల లబ్ధిదారుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఇంతలోనే దంపతులు కలిసిపోయి ఒక్కటిగా జీవిస్తున్నారు. ఈక్రమాన సుజాత పింఛన్‌ను రద్దు చేయాలని కోరుతూ దంపతులు బుధవారం ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.

డీసీసీబీ కొత్త సీఈఓ ఖరారు

కర్నూలు డీజీఎంను ఎంపిక చేసిన కమిటీ?

‘నయీ చేతన’లో

గువ్వలగూడెం వాసి

నేలకొండపల్లి: మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం న్యూ ఢిల్లీలో ‘నయీ చేతన–5.0’ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా నుంచి డీఆర్‌డీఏ ఆధ్వర్యాన ఎంపికై న నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంకు చెందిన పారా లీగల్‌ వలంటీర్‌ కొలిపాక నాగమణి పాల్గొన్నారు. సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, పలువురు మంత్రులు పాల్గొనగా, మహిళలపై హింస, సమాన హక్కులు, లింగ వివక్ష అంశాలపై జరిగిన చర్చలో నాగమణి పాలుపంచుకున్నారు. కాగా, అక్కడ సదస్సులో వెల్లడించిన వివరాల ఆధారంగా మహిళల భద్రతకు సంబంధించి డిసెంబర్‌ 23వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ‘నయీ చేతన’ సదస్సుల్లో ఆమె పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement