రెక్కలుముక్కలు చేసుకున్న డబ్బు చెల్లించాం ఇప్పటికై నా అసలు ఇప్పిస్తే ఆనందం ప్రారంభమైన ‘అగ్రిగోల్డ్’ బాండ్ల పరిశీలన
ఇకనైనా న్యాయం చేస్తారని..
ఖమ్మంక్రైం: దాదాపు అందరివి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలే. కూలీ పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. అయితే, తమ పిల్లలైనా ఇబ్బంది పడొద్దనే భావనతో రూపాయి.. రూపాయి పోగేసి పొదుపు రూపంలో దాచుకుంటే.. అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిపేయడంతో వారి కలలను కన్నీరు మింగేసింది. అయితే, తాము దాచుకున్న డబ్బును ప్రభుత్వం తిరిగి ఇప్పించకపోతుందా అని పద్నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు ఆశలు చిగురించాయి.
మండలాల వారీగా...
రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనే దిశగా ప్రభుత్వం ముందుడుగు వేసింది. ఈక్రమాన బాధితుల వద్ద బాండ్ల పరిశీలన, వివరాల నమోదు కోసం ఖమ్మంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ శిబిరంలో మండలాల వారీగా బాధితులు రావాల్సిన తేదీలను ప్రకటించారు. దీంతో తొలిరోజైన బుధవారం బోనకల్ మండలానికి అవకాశం ఇవ్వగా, పెద్దసంఖ్యలో బాధితులు బాండ్లు, ఇతర ఆధారాలతో వచ్చారు. ఈమేరకు సీసీఎస్ ఏసీపీ సర్వర్ ఆధ్వర్యాన ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. రోజుకు 250మందికి మాత్రమే అవకాశం ఉండడంతో ముందు వచ్చిన వారికి టోకెన్లు జారీ చేసి బాండ్ల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితులను పలకరించగా, వారి ఆవేదన చెప్పుకున్నారు.
కష్టపడి పనిచేస్తూ రోజుకు రూ.200మేర రూ.20వేల వరకు ఏజెంట్ వద్ద చెల్లిం చాం. ఆపై అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పివేయడంతో ఎవరిని కలిసినా న్యాయం దక్కలేదు. ప్రభుత్వం ఇప్పుడు బాండ్లు పరిశీలిస్తుండడంతో డబ్బు తిరిగి వస్తుందని నమ్ముతున్నాం.
– రమణ, మోటమర్రి


