ఖమ్మంమయూరిసెంటర్: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వేయి మందికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో పొంగులేటి స్వరాజ్యం – రాఘవరెడ్డి(పీఎస్‌ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’ పేరిట పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాల కిట్లను పంపిణీ చేశారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి 16 పుస్తకాలతో కూడిన కిట్లను రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్‌కుమార్, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనితతో కలిసి అభ్యర్థులకు అందజేశారు. అభ్యర్థులు కష్టపడి చదివి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను చేరుకోవాలని వారు సూచించారు.
వేయి మందికి 16 పుస్తకాలతో కూడిన కిట్లు


