జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ ఇంటి స్థలం దక్కేవరకూ బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఖమ్మంలో గత ప్రభుత్వం కేటాయించిన 23.2 ఎకరాల భూమిని వెంటనే జర్నలిస్టులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యంపై టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌) ఆధ్వర్యాన ఖమ్మంలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం గర్హనీయమన్నారు. అలవి కాని హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ చివరికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీలోనూ మోసం చేస్తోందన్నారు. కాగా, వివిధ వర్గాల ప్రతినిధులు, పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొని సంతకాలు చేశారు. టీజీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్‌, శ్రీనుతో పాటు వివిధ అసోసియేషన్లు, పార్టీల నాయకులు ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, కోటపాటి రుక్మారావు, కోమలి, నలమాస కృష్ణగౌడ్‌, కోయ చంద్రమోహన్‌, డాక్టర్‌ గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్‌ జీ.వీ.మురళి, డాక్టర్‌ జంగాల సునీల్‌ కుమార్‌, భాస్కర్‌, దేవిరెడ్డి విజయ్‌, లింగాల రవికుమార్‌, మస్తాన్‌, లక్ష్మణ్‌, మోహన్‌రావు, గౌస్‌ పాషా, మేరుగు వెంకటరమణ, అమరగాని వెంకన్నగౌడ్‌, గుంతేటి వీరభద్రం, బానోత్‌ భద్రూనాయక్‌, నరేందర్‌, జంపాల ఈశ్వర్‌, రామయ్య, షకీనా, రాములు మద్దతు పలకగా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి తదితరులు పాల్గొన్నారు.

టీజేఎఫ్‌ సంతకాల సేకరణలో

ఎంపీ వద్దిరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement