ఉషూ టోర్నీలో 13 పతకాలు | - | Sakshi
Sakshi News home page

ఉషూ టోర్నీలో 13 పతకాలు

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ బాలబాలికల ఉషూ టోర్నీలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శిక్షణ పొందుతున్న 18మంది క్రీడాకారులు పోటీలకు హాజరుకాగా 13 పతకాలు సాదించారు. క్రీడాకారులు ఆరు బంగారు, నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు సాదించగా ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరాస్‌కుమార్‌, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్‌ పి.పరిపూర్ణాచారి తదితరులు అభినందించారు.

రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

కొత్తగూడెంఅర్బన్‌: సికింద్రాబాద్‌లో ఈనెల 28, 29వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. రుద్రంపూర్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో సోమవారం నిర్వహించిన పోటీల్లో జట్టును ఎంపిక చేశామని స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి హన్మంతరావు తెలిపారు. ఈమేరకు వివిధ విభాగాల్లో పి.వరప్రసాద్‌, జె.అజయ్‌, ఎం.హరీష్‌, ఎస్‌.డీ.జాసిమ్‌, ఎస్‌.కే.తాహిర్‌ హుస్సేన్‌, సీ.హెచ్‌.మోక్ష చంద్రశేఖరరావు, ఆర్‌.ప్రతీక్‌ సింగ్‌, భగవత్‌, వి.మనీష్‌, ఎం.తోషన్‌కుమార్‌, కె.హేమంత్‌, బి.ధ్రువతేజ్‌, సీ.హెచ్‌.శ్రీదయ, ఎం.అదీప్త్‌, దీప్య సాయి, కృష్ణవేణి, కృతిక, లక్ష్మీహయాతి ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అసోసియేషన్‌ సభ్యులు, కోచ్‌లు మురిసెట్టి లక్ష్మీనరసింహ, డి.రాజు, ఆర్‌.నరహరి, సామ్యేల్‌, శామంత్‌, సంధ్యారాణి, రాంబాబు అభినందించారు.

నేడు అధ్యాపకుల

ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం సహకారనగర్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం ఖమ్మంలో ఏర్పాటుచేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో ఈ సమావేశం జరుగుతుందని నిర్వాహకులు బూరుగు అప్పారావు, డాక్టర్‌ కొమ్ము జాల్‌ అభిజిత్‌ దేవ్‌, డాక్టర్‌ రాజిరెడ్డి తెలిపారు. గెజిటెడ్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కడారు సురేందర్‌రెడ్డి పాల్గొననున్న ఈ సమావేశానికి అతిథి అధ్యాపకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ముచ్చర్లలో కొత్తగా

సబ్‌స్టేషన్‌

ట్రాన్స్‌కో నుంచి సాంకేతిక అనుమతులు జారీ

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మరో 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు అనుమతి లభించింది. కామేపల్లి మండలం ముచ్చర్ల(కారేపల్లి ఎక్స్‌ రోడ్‌)లో సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు ట్రాన్స్‌కో నుంచి సాంకేతిక అనుమతి జారీ చేశారు. ప్రస్తుతం కారేపల్లి, కామేపల్లి తదితర ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్లకు ఇల్లెందు, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. పెరుగుతున్న లోడ్‌ కారణంగా తరచూ లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతుండడంతో ముచ్చర్లలో కొత్త సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించగా అనుమతి లభించింది. ఈ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో కారేపల్లి, కామేపల్లి, ఏన్కూరు మండలాల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారమై నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. కాగా, సబ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు మూడెకరాల స్థలాన్ని కలెక్టర్‌ ఇప్పటికే కేటాయించారని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు.

వైద్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

మధిర: మధిర ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు వైద్యులను ఇటీవల సస్పెండ్‌ చేశారు. ఈక్రమాన డాక్టర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు సోమవారం కలెక్టర్‌ దివాకరను కలిసి పరిస్థితులను వివరించడంతో సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని, సమయపాలన పాటించాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement