దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించాలి

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

ఖమ్మం వైరారోడ్‌: ‘కేసీఆర్‌ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదంతో రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్‌ 29న ‘దీక్షా దివస్‌’గా నిర్వహించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఖమ్మంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ దీక్షకు సిద్ధం కాగా, ఖమ్మంలో ఉద్యమ ఉధృతి తక్కువగా ఉందనే భావనతో నాటి పాలకులు ఆయనను ఖమ్మం తరలిస్తే.. ఇక్కడి ప్రజలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు లెఫ్ట్‌ పార్టీలు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. ఆనాటి కేసీఆర్‌ దీక్షతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిందని తెలిపారు. కాగా, ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టిన చరిత్ర ఉన్న వారు నేడు త్యాగాలపై మాట్లాడటం గర్హనీయమన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో పోటీ చేస్తే ఆమెను ఓడించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం గత మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడంతో పాటు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందని పువ్వాడ విమర్శించారు. నాయకులు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్‌, ఖమర్‌, వీరూనాయక్‌, గుత్తా రవి, మెంతుల శ్రీశైలం,పొన్నం వెంకటేశ్వర్లు, బత్తుల మురళి, షకీనా తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement