ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–14 బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా బాలబాలికల జట్లు విజేతగా నిలిచాయి. మూడు రోజులుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా బాలుర బాలుర విభాగంలో ప్రథమస్థానాన రంగారెడ్డి నిలవగా, హైదరాబాద్, మెదక్ జట్లు రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలోనూ రంగారెడ్డి జట్టు టైటిల్ దక్కించుకుంది. రెండు, మూడో స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్ జట్లు నిలిచాయి. ఈ మేరకు విజేతలకు ఎంఈఓ శైలజాలక్ష్మి, జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.చిన్ని, హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాడెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి, టోర్నమెంట్ పరిశీలకులు ఎల్.మల్లీశ్వరి ట్రోఫీలు అందజేయగా, పీడీ, పీఈటీలు నాగయ్య, రమణ, కృష్ణమూర్తి, రామారావు, సైదేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సాఫ్ట్ టెన్నిస్ పోటీలు
ఖేలో ఇండియా అస్మిత క్రీడా పోటీల్లో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న సాఫ్ట్ టెన్నిస్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు బహుమతులలు అందజేయగా, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, యూసీపీఈ ప్రిన్సిపాల్ సీహెచ్.రవికుమార్, బ్లూమింగ్ మైండ్స్ పాఠశాల చైర్మన్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండర్–15 బాలికల విభాగంలో జె.హర్షిత(భద్రాద్రి కొత్తగూడెం), సాయిప్రియ (మహబూబాబాద్), హెచ్.భార్గవి, ఎం.శరణ్య(ఖమ్మం), బాలికల డబుల్స్‌లో ఎం.సాన్విత – ఎం.హర్షిత(నిజామాబాద్), బి.జోత్న్స – బి.హేతవి(రంగారెడ్డి), ప్రణయ – వాన్సిక(ఖమ్మం), జె.హర్షిత – బి.వర్షిణిశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం) వరుసగా మొదటి మూడు స్థానాలోనిలిచారు. అండర్–19 బాలికల సింగిల్స్‌లో భానుశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం), దిలిషామసూద్(హైదరాబాద్), కె.సహస్ర(ములుగు), జి. తేజస్విబాయి(వనపర్తి), డబుల్స్‌లోలో జి.హర్షవర్థిని – టి.ప్రణతి(కరీంనగర్), టి.హావీలా – పి.బ్లెసీ(నల్లగొండ), భానుశ్రీ – దితిషామసూద్(భద్రాద్రి కొత్తగూడెం), పి.నవ్య, బి.పూజిత(వరంగల్) ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు దక్కించుకున్నారు.
బాలికల విభాగంలో
ఖమ్మంకు మూడోస్థానం


