అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట | - | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

● రేపటి నుంచి బాండ్ల ధ్రువీకరణ, నమోదు ప్రక్రియ ● ఖమ్మంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

బాండ్ల పరిశీలనకు ఏర్పాట్లు

● రేపటి నుంచి బాండ్ల ధ్రువీకరణ, నమోదు ప్రక్రియ ● ఖమ్మంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

ఖమ్మంక్రైం: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు. బాధితులు, ఏజెంట్ల వద్ద ఉన్న బాండ్ల ధ్రువీకరణ, వివరాల నమోదు కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు జిల్లాలోనూ కేంద్రం ఏర్పాటుచేస్తుండగా, మండలాల వారీగా బాధితులు రావాల్సిన తేదీలను పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ప్రకటించారు. నిర్ణీత తేదీల్లో డిపాజిటర్లు, ఏజెంట్లు అవసరమైన బాండ్ల ధ్రువీకరణ, నమోదుకు హాజరుకావాలని, బాండ్లను పరిశీలన కోసం చూపించాలే తప్ప ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని సీపీ స్పష్టం చేశారు. ఖమ్మంలోని సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌(పాత సీపీ కార్యాలయం)లో కేంద్రం కొనసాగుతుందని తెలిపారు. సందేహాలు ఉంటే 87126 59185(సీపీఎస్‌ ఏసీపీ), 8712659186(సీసీఎస్‌ సీఐ), 87125 75166, 98485 86894(ఆర్‌ఐ), 8712593269 (ఎస్‌ఐ)ను సంప్రదించాలని సీపీ సూచించారు. నిర్ణీత కేంద్రంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు పత్రాలు అందజేయవచ్చని తెలిపారు.

మండలాల వారీగా ఖాతాదారులు

రావాల్సిన తేదీలు

ఈనెల 25, 26, 27, 28, 30, డిసెంబర్‌ 1వ తేదీల్లో బోనకల్‌ మండలాల డిపాజిటర్లు, ఏజెంట్లు బాండ్ల ధ్రువీకరణ, నమోదుకు హాజరుకావాలి. డిసెంబర్‌ 1, 2, 3, 4, 5వ తేదీల్లో చింతకాని, 5, 7, 8, 9, 10వ తేదీల్లో ఏన్కూరు, 10, 11, 14, 15, 16వ తేదీల్లో కల్లూరు, 16, 17, 18, 19, 22వ తేదీల్లో కామేపల్లి, 22, 23, 24, 28వ తేదీల్లో ఖమ్మం రూరల్‌ మండలం, 27, 29, జనవరి 19వరకు ఖమ్మం అర్బన్‌ మండలం ఏజెంట్లు, డిపాజిటర్లు హాజరుకావాలి. అలాగే, జనవరి 19, 21 నుంచి 31వ తేదీ వరకు కొణిజర్ల మండలం, జనవరి 31నుంచి ఫిబ్రవరి 8వరకు కూసుమంచి, 9నుంచి 16వ తేదీ వరకు మధిర, 17నుంచి 27వ తేదీ వరకు ముదిగొండ, మార్చి 1నుంచి 17వరకు నేలకొండపల్లి, 18నుంచి 19వరకు పెనుబల్లి, 20నుంచి 24వరకు రఘునాథపాలెం, 25నుంచి ఏప్రిల్‌ 3వరకు సత్తుపల్లి మండలం వారు హాజరుకావాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్‌ 6నుంచి 12వరకు సింగరేణి మండలం, 12నుంచి 22వ తేదీ వరకు తల్లాడ, 23నుంచి 28వ తేదీ వరకు తిరుమలాయపాలెం, 29నుంచి మే 4తేదీ వరకు వేంసూరుతో పాటు మే 5నుంచి 10వ తేదీ వరకు వైరా, 11నుంచి 15వ తేదీ వరకు ఎర్రుపాలెం మండలానికి చెందిన డిపాజిటర్లు, ఏజెంట్లు హాజరుకావాల్సి ఉంటుంది.

ధ్రువీకరణకు తీసుకురావాల్సిన పత్రాలు

డిపాజిటర్‌ జీవించి ఉంటే : అగ్రిగోల్డ్‌ అసలు బాండ్‌, నగదు రశీదు(తప్పనిసరి), అసలు బాండ్‌ సెల్ప్‌ అటెస్టెడ్‌ కలర్‌ జిరాక్స్‌, ఆధార్‌ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌, తాజా పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, సెల్‌ నంబర్‌, ఏజెంట్‌ పేరు, సెల్‌ నెంబర్‌ సమర్పించాలి.

డిపాజిటర్‌ మృతి చెంది, నామినీ జీవించి ఉంటే : అసలు బాండ్‌, కలర్‌ జిరాక్స్‌(నామినీ సంతకంతో), డిపాజిటర్‌ మరణ ధ్రువపత్రం జిరాక్స్‌, నామినీ ఆధార్‌, పాన్‌కార్డుల జిరాక్స్‌, రేషన్‌ కార్డు, కుటుంబసభ్యుల ధ్రువపత్రం, నామినీ బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, నామినీ ఫొటో, ఏజెంట్‌ వివరాలు(తెలిస్తే),

డిపాజిటర్‌, నామినీ ఇద్దరు మృతి చెందితే : అసలు బాండ్‌, బాండ్‌కలర్‌ జిరాక్స్‌(చట్టబద్ధ వారసుడు, కుటుంబీకుడి సంతకంతో), డిపాజిటర్‌, నామినీ ఇద్దరి మరణఽ ధ్రువీకరణ పత్రాలు(అసలు చూపించి జిరాక్స్‌ సమర్పించాలి), వారసుడి ఆధార్‌, పాన్‌ కార్డు, రేషన్‌ కార్డు, కుటుంబసబ్యుల ధ్రువీకరణ పత్రం(అసలుచూపించి జిరాక్స్‌ సమర్పించాలి), వారసుడి బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, ఫొటో, ఏజెంట్‌ వివరాలు (తెలిస్తే),

డిపాజిటర్‌ జీవించి ఉండి కేంద్రానికి రాలేకపోతే : డిపాజిటర్‌ అసలు బాండ్‌, సంతకం చేసిన కలర్‌ జిరాక్స్‌, ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌(అసలు చూపించి జిరాక్స్‌ సమర్పించాలి), ఫొటో, హాజరయ్యే కుటుంబ సభ్యుల ఆధార్‌, గుర్తింపు కార్డు(అసలు చూపించి జిరాక్స్‌) సమర్పించాలి. కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం జిరాక్స్‌, రేషన్‌ కార్డు లేదా ఇతర పత్రం, డిపాజిటర్‌ జారీ చేసిన అధికార పత్రం

ఏజెంట్ల ద్వారా బాండ్ల సమర్పణ : అసలు బాండ్‌ను చూపించి కలర్‌ జిరాక్స్‌ సమర్పించాలి. ఏజెంట్‌ ఆధార్‌, పాన్‌ కార్డుల జిరాక్స్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఫొటో అందజేయాలి.

అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్ల పరిశీలన బుధవారం నుంచి మొదలుకానుండగా, సీటీసీలో ఏర్పాటుచేసిన కేంద్రంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీపీ సునీల్‌దత్‌ సూచించారు. పోలీసు అధికారులతో సోమవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ బాండ్ల పరిశీలనకు వచ్చే బాధితులు ఇబ్బంది పడకుండా సమన్వయంతో పనిచేయాలని, రద్దీ నియంత్రణపై దృష్టి సారించాలని తెలిపారు. డిపాజిటర్లు, ఏజెంట్లు కూడా షెడ్యూలు ప్రకారమే హాజరుకావాలని సూచించారు. ఈసమావేశంలో ఏసీపీలు సర్వర్‌, మహేష్‌, సుశీల్‌సింగ్‌ పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement