మున్నేరు–పాలేరు లింక్‌ కెనాల్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మున్నేరు–పాలేరు లింక్‌ కెనాల్‌ రద్దు చేయాలి

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని 5వ షెడ్యూల్‌ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతిపాదించిన మున్నేరు–పాలేరు లింక్‌ కెనాల్‌ నిర్మాణం గిరిజనుల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా ఉన్నందున వెంటనే రద్దు చేయాలని స్పర్శ సామాజిక అధ్యయన వేదిక నిర్వాహకులు కాకి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) ముద్రించిన మున్నేరు గిరిజన అస్తిత్వ పోరాటం కరపత్రాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. గార్ల మండలంలో 9.6 కిలోమీటర్ల లింక్‌ కెనాల్‌ నిర్మిస్తే గిరిజనుల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. ఇందుకు గ్రామసభ తీర్మానాలు అవసరం కాగా, నకిలీవి సృష్టించడం గర్హనీయమని చెప్పారు. వివాదాస్పద కెనాల్‌కు బదులు 2009లో మంజూరైన మున్నేరు రిజర్వాయర్‌ పనులను ముల్కనూర్‌ వద్ద పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 45 వేల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జంపాల విశ్వ, టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడ్డుగోర్ల నరేందర్‌, వివిధ సంఘాల నాయకులు గుంతేటి వీరభద్రం, వేణు, దేవిరెడ్డి విజయ్‌, శ్రీను, పప్పుల వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement