రూ.10 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

సత్తుపల్లి(వేంసూరు): వేంసూరు మండలం పల్లెవాడకు చెందిన యలమంచి సత్యనారాయణ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి రూ.10లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... పల్లెవాడకు చెందిన యలమంచి సత్యనారాయణ నూతన గృహప్రవేశం ఈనెల 16న జరిగింది. ఆ మరుసటి రోజు 17వ తేదీన పాత ఇంట్లోని బీరువా లాకర్‌ను పరిశీలించగా, లాకర్‌ పగులగొట్టి ఉండడంతో పాటు 82 గ్రాముల బంగారు ఆభరాణలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన సత్యనారాయణ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ పి.సర్వయ్య పర్యవేక్షణలో ఎస్‌ఐ పల్లెల ప్రదీప్‌ ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు. వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించగా ఎర్రుపాలెం మండలం బీమవరానికి చెందిన గొల్ల పూడి శ్రీహరిని గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించడంతో 30 గ్రాముల చేతి కడియాలు, 48 గ్రాముల మూడు చైన్లు, నాలుగు గ్రాముల లాకెట్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement