అనాథ ఆశ్రమాల్లో కాంతి రేఖలు | - | Sakshi
Sakshi News home page

అనాథ ఆశ్రమాల్లో కాంతి రేఖలు

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

ఉద్యోగుల స్వచ్ఛంద సహకారంతో..

సీఎండీ వరుణ్‌రెడ్డి ఆలోచనతో ఎన్పీడీసీఎల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలో నాలుగు

సంస్థలకు అధికారులు,

ఉద్యోగుల తోడ్పాటు

అందరూ కలిసి

ప్రతి నెలా

రూ.80 వేలసాయం

ఉమ్మడి జిల్లాలో నాలుగు సంస్థలకు సాయం

ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా రూ. 20 వేల చొప్పున నాలుగు సంస్థలకు మొత్తం రూ. 80 వేలు ఆర్థికసాయం చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో అనాథలతోపాటు ఆదరణ లేని పెద్దలు, దివ్యాంగులు ఆశ్రయం పొందుతున్నారు. భోజనం, మందులు, బట్టలు, సంరక్షణకు నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఖమ్మం రోటరీ నగర్‌లో ఉన్న అన్నం సేవా ఫౌండేషన్‌, మధిర మండలం దిడుగులపాడులో ఉన్న మరణాత ఆర్కే ఫౌండేషన్‌, పాల్వంచలోని శాంతి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (చెవిటి, మూగ, దివ్యాంగ సంక్షేమం), భద్రాచలం శాంతి నగర్‌లోని మానవ సేవా వలంటరీ ఆర్గనైజేషన్‌కు తోడ్పాటనందిస్తున్నారు.

ప్రతీ ఉద్యోగి నెలకు కనీసం రూ. 50. కొందరు రూ. 100, రూ. 500, రూ. 1000, మరికొందరు వేల రూపాయలు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ప్రతి నెలా రూ. 5.60 లక్షలు సమకూరుతుండగా ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 18 జిల్లాల్లో 27 స్వచ్ఛంద సంస్థలకు నెలకు రూ. 20 వేల చొప్పున అందిస్తున్నారు. చట్టబద్ధత కలిగి, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ పొందిన సంస్థలకే సాయం అందిస్తున్నారు. దీంతో ప్రతీ రూపాయి అవసరమున్న వారికే చేరుతోంది. కార్మిక సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాల స్వచ్ఛంద అంగీకారంతోనే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

అనాథలు, వృద్ధులకు విద్యుత్‌ శాఖ ఆర్థికసాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement