● చరిత్ర ఆనవాళ్ల అన్వేషణ కోసమే ఎన్‌జీఆర్‌ఐ సర్వే ● పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్‌రావు
నేలకొండపల్లి: బౌద్ధక్షేత్రం అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తామని పురావస్తు శాఖ డైరెక్టర్ కె.అర్జున్‌రావు తెలిపారు. నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం పరిసరాల్లో పురాతన కట్టడాలు, స్తూపం చారిత్రక ఆనవాళ్లను గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌జీఆర్‌ఐ సర్వేను శనివారం ప్రారంభించారు. నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రతినిధి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సక్రం బృందం సర్వే చేపట్టింది. బౌద్ధక్షేత్రంతో పాటు, బైరాగి గుట్ట తదితర ప్రాంతాలలో సర్వే జరిపారు. అత్యాధునిక యంత్రాలతో భూమిని స్కానింగ్ చేస్తున్నారు. దాదాపు 6 నుంచి 20 మీటర్ల లోతు వరకు భూమిలో ఉన్న చారిత్రక ఆనవాళ్లను గుర్తించనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్‌రావు మాట్లాడుతూ సర్వే బృందం ఇచ్చిన డాక్యుమెంట్ ఆధారంగా తవ్వకాలు చేపడతామని అన్నారు. బౌద్ధక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్.పి.నాగరాజు జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తి, పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి, మల్లు, ఎన్‌జీఆర్‌ఐ స్కాలర్స్ సంతోష్, రమేష్, జేఈ శంకర్, సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రీన్‌వే సంస్థ చైర్మన్ దుడ్డెల రవికుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు పాల్గొన్నారు.
విద్యార్థుల సందడి
బౌద్ధక్షేత్రం వద్ద సందడి నెలకొంది. ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పలు పాఠశాలల విద్యార్థులు శనివారం స్తూపాన్ని సందర్శించారు.


