ముగ్గురు తహసీల్దార్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని మూడు మండలాల తహసీల్దార్లను డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతా లకు కేటాయిస్తూ కలెక్టర్‌ దివాకర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఆర్‌డీఓ కార్యాలయంలో పోస్టింగ్‌ ఉండి ముదిగొండలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.ఉషాశారదను ఎర్రుపాలెంకు, ఎర్రుపాలెం తహసీల్దార్‌ సునీత ఎలిజబెత్‌ను వేంసూరుకు, వేంసూరు తహసీల్దార్‌ జె.మాణిక్‌రావును ఖమ్మం ఆర్‌డీఓ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై కేటాయించారు. ఈమేరకు తహసీల్దార్లు నూతన స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని కలెక్టర్‌ సూచించారు.

పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ జట్టు ఎంపిక

కేయూ క్యాంపస్‌: చైన్నెలోని వినాయక మిషన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నీకి కాకతీయ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టు వివరాలను కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ టి.శాస్త్రి గురువారం వెల్లడించారు. జట్టుకు సొప్పరి తేజ(ఆర్‌జేఆర్‌ఎం డిగ్రీ కళాశాల, ఖమ్మం), కేత అభిరామ్‌(కవిత మెమోరియల్‌ డిగ్రీ కళాశాల, ఖమ్మం) ఎంపికయ్యారని తెలిపారు. జట్టుకు హనుమకొండలోని జాగృతి డిగ్రీ కళాశాల పీడీ ఏ.రాజేష్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

‘అక్వాన్‌’తో చలి, గాలులు

● అన్నదాతల్లో భయం...భయం

ఖమ్మంవ్యవసాయం: ‘అక్వాన్‌’ తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో గురువారం ఉదయం నుంచే ఈదురు గాలులు మొదలయ్యాయి. అంతేకాక రెండు రోజు లుగా సాయంత్రం నుంచే చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గురువారం పగటి ఉష్ణోగ్రత 29 – 30 డిగ్రీల మధ్య, రాత్రి ఉష్ణోగ్రత 19 – 20 డిగ్రీల మధ్య నమోదైంది. గంటకు 14 – 18 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి, పత్తి చివరి దశలో, మిర్చి పూత, కాత దశలో ఉన్నాయి. ఈ సమయాన ఈదురుగాలులు, చలి, తేమ పెరగడం పంటలపై ప్రభావం చూపుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మురసు తుపాన్‌తో పంటలు కోల్పోయిన తాము మరో తుపాన్‌ వస్తే తట్టుకోలేమని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement