‘ఖేలో’ పోటీల ఏర్పాట్లపై ఆరా | - | Sakshi
Sakshi News home page

‘ఖేలో’ పోటీల ఏర్పాట్లపై ఆరా

Nov 25 2026 12:32 AM | Updated on Nov 25 2026 12:32 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీల నిర్వహణకు వేదికగా ఖరారైన ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మయాంత్‌ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. వచ్చేనెల 17నుంచి 20వ తేదీ వరకు టోర్నీ జరగనున్న నేపథ్యాన స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యే క్రీడాకారులు, కోచ్‌లకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నోడల్‌ అధికారి పరాస్‌, డిప్యూటీ డైరెక్టర్‌ హరిష్‌బాబు, శాయ్‌ నిపుణులు డాక్టర్‌ రఘు, రూపేష్‌కుమార్‌, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.

విస్తృత ప్రచారానికి ప్రణాళిక

ఆర్చరీ టోర్నీపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానుండడంతో యువత పెద్దసంఖ్యలో పోటీలను వీక్షించేలా జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 26వ తేదీన ఖమ్మంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు, అన్ని మండల కేంద్రాల్లో లోగో, మస్కట్లు ఆవిష్కరించనుండగా, రద్దీ ప్రాంతాలు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మస్కట్‌ సెల్ఫీ పాయింట్లు, కౌంట్‌డౌన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాక విద్యార్థులు, యువతను భాగస్వాములను చేసేందుకు వచ్చేనెల 1న అన్ని విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ క్విజ్‌, 3న పెయింటింగ్‌ పోటీలు, 6వ తేదీన ప్రముఖులు, క్రీడాకారులతో కలిసి ఖేలో ఇండియా రన్‌ వాకథాన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

స్టేడియంలో పరిశీలించిన

‘శాయ్‌’ డిప్యూటీ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement