ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా 54 జంటలు పాల్గొనగా, అర్చకులు వ్రతం చేయించారు. అలాగే, సాయంత్రం ఆలయంలోని కోనేరు వద్ద కార్తీక దీపోత్సవం, గంగా హారతి నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరు జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు మున్సిపల్ కమిషనర్
మధిర: ప్రభుత్వ ఆదేశాల మేరకు మధిర మున్సిపల్ కమిషనర్ బెనటిక్ సామ్యూల్ పాల్ ఇరవై రోజుల పాటు డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయానికి వెళ్లారు. డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తారు. ఈ క్రమాన మధిర బాధ్యతలను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్‌కు అప్పగించారు. ఆయన మధిర మున్సిపల్ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
రాష్ట్ర హ్యాండ్‌బాల్ జట్టు కోచ్‌గా మోహన్
ఖమ్మం స్పోర్ట్స్: బాలికల రాష్ట్ర హ్యాండ్‌బాల్ జట్టు కోచ్‌గా వరికూటి మోహన్ నియమితులయ్యారు. పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లా మస్తువానా సాహిబ్‌లో జరిగే జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొననున్న తెలంగాణ బాలికల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారు. ఈమేరకు రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మోహన్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
రేక్ పాయింట్‌కు 3,132 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు ఇఫ్‌కో కంపెనీకి చెందిన 3,132 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. ఇందులో నుంచి కోటా వారీగా ఖమ్మం జిల్లాకు 932 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు.


