ఖమ్మంరూరల్: మాదవద్రవ్యాల వినియోగంతో ఎదురయ్యే ముప్పుపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటూ మరికొందరు మార్పు తీసుకురావాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి సూచించారు. దానవాయిగూడెంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల, కళాశాలలో మాదకద్రవ్యాల నివారణపై గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాక కుటుంబాలు, సమాజం నష్టపోతాయని తెలిపారు. ఈమేరకు విద్యార్థినులు అప్రమత్తంగా ఉంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇదే సమయాన విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. అనంతరం విద్యార్థినులకు పుస్తకాలు అందజేశారు. సదస్సులో వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఎకై ్సజ్ స్టేషన్–2 సీఐ కె.రాజు, ఎస్‌ఐ ఆర్.కిరీటి, ఉపాధ్యాయులు, ఎకై ్సజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి


