తల్లాడ: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే అండర్–14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తల్లాడ బాలభారతి విద్యాలయం విద్యార్థి భూక్యా మహేందర్‌నాయక్ ఎంపికయ్యాడు. మధిరలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మహేందర్‌ను ఎంఈఓ ఎన్. దామోదర్ ప్రసాద్, కేఎస్‌ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్, డైరెక్టర్లు కోటగిరి రాధ, శ్రావణి, ప్రిన్సిపాల్ తాళ్లూరి రామారావు, పీఈటీ ధర్మసోతు సైదా అభినందించారు.
జిల్లాస్థాయి పోటీలకు భరత్ స్కూల్ విద్యార్థి
మధిర: నియోజకవర్గ స్థాయి ఎన్నికల, అక్షరాస్యత క్లబ్‌ల ఆధ్వర్యాన మధిరలో బుధవారం నిర్వహించిన క్విజ్ పోటీల్లో భరత్ స్కూల్ విద్యార్థి జె.మోక్షిత్ కృష్ణ ప్రథమ స్థానాన నిలిచాడు. దీంతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై న మోక్షిత్, గైడ్ టీచర్ రామడుగు గణేష్ భద్రంను భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, డైరెక్టర్ విద్యాలత, ప్రిన్సిపాళ్లు జింకల కోటేశ్వరరావు, ఉమ, డీన్ రవీందర్‌రెడ్డి, ఇన్‌చార్జిలు స్రవంతి, ప్రియాంక తదితరులు అభినందించారు.


